1 March, 2026 | 2:49 AM

కోట పబ్లిక్ స్కూల్‌లో వైజ్ఞానిక ప్రదర్శనలు

01-03-2026 12:57 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలోని కోట పబ్లిక్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు స్వయంగా రూపొందించిన పలు శాస్త్రీయ నమూనాలు, ప్రత్యక్ష ప్రయోగాలు, వినూత్న ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శనలు నిర్వహించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట విద్యాసంస్థల అధినేత డాక్టర్ డి అంజిరెడ్డి హాజరై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆసక్తిగా వీక్షించారు. ప్రతి మోడల్ వద్ద ఆగి విద్యార్థులను ప్రశ్నిస్తూ, వారి ఆలోచన విధానాన్ని అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.