calender_icon.png 30 October, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్‌టీచర్ లేక.. బుక్కు తెరవక!

29-10-2025 12:34:46 AM

-ఆ సబ్జెక్టుపై గాడి తప్పుతున్న విద్యార్థులు

-టీచర్ ను కేటాయించాలంటూ విద్యార్థుల ఆవేదన 

అలంపూర్ అక్టోబర్ 28:విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి నేటి వరకు బ యో సైన్స్ టీచర్ లేక బుక్కు తెరవని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఈపాటికి సగం సిలబస్ పూర్తి అయ్యుండాలి.కానీ నేటి వర కు జీవశాస్త్రం బుక్కు తెరవలేదు. అందుకు సంబంధించిన టీచర్ కొరత కారణంగా వి ద్యార్థులు ఆ పుస్తకం వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా అన్ని సబ్జెక్టులకు సం బంధించి బోధించే గురువులు ఉంటే విద్యార్థులకు ఏ ఆటంకం లేకుండా సదువులు సా ఫీగా సాగిపోతాయి.

ఫలితంగా పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువులే కరువయ్యారు. దీంతో విద్యా ర్థులు ఆయా సబ్జెక్టుల్లో గాడి తప్పుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభు త్వాలు.. కనీసం గురువులను అందించే స్థితిలో కూడా లేనట్టు స్పష్టమవుతుంది.టీచర్ల కొరత కారణంగా విద్యార్థులు వచ్చిరాని చదువులతో కుస్తీ పడుతున్నారు. ఇప్పటివరకు కీలక సబ్జెక్టులకు సంబంధించి టీచర్లు లేకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనకబాటుతనానికి గురవుతున్నారు. ఈ దుస్థితి గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు గ్రామంలో ఉన్న జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎదురైంది.

దాదాపు ఈ పాఠశాలలో అన్ని తరగతులను కలుపుకుని 274 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.ముఖ్యంగా పదవ తరగతిలో 45 మంది విద్యార్థులు ,9వ తరగతిలో 50 పైగా విద్యార్థులు ఉన్నా రు. టీచర్లను కేటాయించాలని విద్యార్థులు ఎన్నో సార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు.కాగా ఇటీవలే గణితం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు టీచర్లను కేటాయించారు.

కానీ ఇంతవరకు బయోసైన్స్ ను బోధించే టీచర్ రాలేదని బుక్కులోని మొదటి పాఠ్య అంశమే ఇటీవలే ప్రారంభించామని విద్యార్థులు వాపోతున్నారు.దీనిపై సంబంధిత వి ద్యాశాఖ అధికారి శివకుమార్ ని విజయ క్రాంతి సంప్రదించి వివరణ అడగగా... బ యో సైన్స్ టీచర్ లేడు వాస్తవమేనని అయి తే ఇట్టి సమస్యపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.జిల్లా ఉన్నతాధికారుల మేరకు త్వరలోనే నియమిస్తామని చె ప్పుకుంటూ వస్తున్నారు. 

అయితే గతంలో ఈ ప్రాథమిక పాఠశాల నుండి జడ్పీ పాఠశాలకు అప్ గ్రేడ్ అయ్యింది.స్కూలు ప్రారం భంలో డిప్యూటేషన్ పై టీచర్లు వచ్చేవారు. కానీ ఈ ఏడాది ఐదు నెలలు గడుస్తున్న ఇంతవరకు టీచర్ల కొరత ఏర్పడిందని త ద్వారా చదువులు సక్రమంగా కొనసాగగా పరీక్షల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆయా సబ్జెక్టులకు పూర్తిస్థాయిలో టీచర్లను కేటాయించాలని వేడుకుంటున్నారు.