29-10-2025 12:34:09 AM
రైస్‌మిల్లర్లను ఆదేశించిన కలెక్టర్ రాజార్షి షా
ఆదిలాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం. ఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సి.ఎం.ఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్న బియ్యం మిల్లిం గ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు.
సివిల్ సప్లై కమిషనర్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మిల్లర్లు సి.ఎం.ఆర్ సరఫరా చేయకపోతే ఆర్.ఆర్ చట్టం కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. 202324 సీజన్కు సంబంధించిన మిగిలిన నాన్ అకౌంటెడ్ మిల్లర్ల వద్ద ఉన్న సన్న బియ్యాన్ని తక్షణం సరఫరా చేయాలని ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి వంద శాతం సి.ఎం.ఆర్ సరఫరా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వారం మిల్లర్లు తమ సరఫరా పురోగతిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నివేదికలు సమర్పించాలనీ ఆదేశించారు.
బ్యాంకు రుణ సౌకర్యాల వినియో గంలో మిల్లర్లు తమ మిల్లింగ్ సామర్థ్యం, ఎఫ్ సి ఐ మార్గదర్శకాల మేరకే రుణాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్లు సక్రమంగా సన్నబియ్యం మిల్లింగ్ చేసి, సమయానికి సివి ల్ సప్లై గోదాములకు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదన పు కలెక్టర్ శ్యామల దేవి, జిల్లా సివిల్ సప్లై అధికారి నందిని, డిఎం సుధారాణి, మిల్లర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.