15 April, 2026 | 2:13 AM

చెరువులో మొసళ్లను త్వరలో పట్టుకుంటాం

06-12-2025 12:00 AM

మెదక్ డీఎఫ్వో జోజో

చేగుంట, డిసెంబర్ 5 : చేగుంట మండలం వడియారం పెద్ద చెరువును జిల్లా అటవీశాఖాధికారి జోజో శుక్రవారం సందర్శిం చారు. వడియారం చెరువులో రెండు మొసళ్లు సంచరిస్తున్న విషయం తెలిసిందే. మొసళ్లు చెరువులో ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి జోజో మొసళ్లు ఉన్న చెరువును పరిశీలించా రు. మొసళ్ళను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, బీట్ ఆఫీసర్ రవి, గ్రామస్తులు రమేష్, సాయికుమార్ గౌడ్ తదితరు లు పాల్గొన్నారు.