9 April, 2026 | 11:03 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

స్క్రాప్ డీలర్ నిజాయితీ

21-02-2026 02:07 AM

చెత్తతో పాటు అనుకోకుండా బంగారం విక్రయం

పొరపాటున చెత్తతో పాటు రూ.15 లక్షల విలువైన బంగారం కూడా..

బంగారాన్ని పోలీసులకు అప్పగించిన స్క్రాప్ డీలర్

హరియాణా ఫరీదాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి..

చండీగఢ్, ఫిబ్రవరి 20 : హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన స్క్రాప్ డీలర్ అనుకోకుండా తన వద్దకు వచ్చిన రూ.15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. గత దీపావళి పండుగ(నాలుగు మాసాల క్రితం) సందర్భంగా నగరానికి చెందిన అశోక్ తన ఇంటిని మొత్తం శుభ్రం చేసి చెత్తను స్థానిక స్క్రాప్ డీలర్ హాజీ అక్తర్‌కు విక్రయించాడు. అనుకోకుండా ఈ చెత్తలోనే 10 తులాల బంగారం వెళ్లింది. దీనిని అశోక్, స్క్రాప్ కొనుగోలుదారు కూడా గుర్తించలేదు.

కొన్ని రోజుల తర్వాత ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో అశోక్ కుటుంబం స్క్రాప్ డీలర్‌ను సంప్రదించింది. వారు ఎంతగా వెతికినా బంగారం దొరకకపోవడంతో అశోక్ కుటుంబం నిరాశపడింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఇటీవల స్క్రాప్ డీలర్ చెత్తను వేరు చేస్తున్న సమయంలో అక్తర్ బంగారు ఆభరణాలను గుర్తించాడు. వెంటనే వాటిని స్థానిక పోలీసులకు అప్పగించాడు. అలాగే బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న అశోక్ గురించి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు అశోక్ కుటుంబాన్ని పిలిపించి ఆ బంగారు ఆభరణాలను అప్పగించారు.