పాత ఇనుము.. ఎగబడుతున్న జనం..!
- మేళ్లచెరువులోని మై హోమ్ సమీప భూమిలో సేకరిస్తున్న వైనం
- రోజుకి రూ.5, 10వేల ఆదాయం.
- వారంలో ఓ కుటుంబం రూ.2.5లక్షలు సంపాదించినట్లు ప్రచారం.
- ఏరిన పాత ఇనుమును అక్కడే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
సూర్యాపేట, మే 15 (విజయక్రాంతి) : పైసల కోసం పాకులాడే మనిషి నిత్యం దానికోసమే చింతన చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దేనినుంచైనా లాభం పొందాలనే తపనతోనే ముందుకు సాగుతుంటాడు. రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ట్రాక్టర్ బోల్ట్ లు, నట్లు వదలని వ్యక్తులు ఇక ఎక్కడైనా పాత ఇనుము ఫ్రీగా వస్తుందంటే ఆగుతారా.. అదే తడువుగా అందుకుని వచ్చిందే సొమ్ము అనుకుని అమ్మేసుకుంటుంటారు. అది దొరుకుదుందంటే చాలు ఎర్రటి ఎండా.. వరదలు పారె వాన చూడకుండా దొరికిన దాన్ని పోగేసుకుని ప్రయత్నం చేస్తుంటారు. ఇదే ప్రస్తుతం జిల్లాలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో జరుగుతుంది.
మేళ్లచెరువు లో గల మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీప భూముల్లో వేస్ట్ మెటీరియల్ డంపు చేయగా దానిలో పాత ఇనుము ఉండడంతో అక్కడ ఉన్న మట్టి దిబ్బలు తవ్వి, తవ్వి ఇనుమును వెలికి తీస్తున్నారు. వెలికి తీసిన ఇనుమును అక్కడే అమ్ముకుని రోజుకి రూ.10వేలు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గత వారం రోజులుగా అందరికీ తీయడంతో సుమారు 100మంది నిత్యం ఇనుమును వెలికి తీసి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
డస్ట్ బిన్‌గా మారిన భూదాన్ భూమి!:
మేళ్లచెరువు మండల కేంద్ర పరిధిలోని సర్వే నెంబర్ 1057 లో 150 ఎకరాల భూదాన్ భూమి ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ భూమిలో కొంతమేర మైహోమ్ ఫెన్సింగ్ వేసి కోర్టు కేసులు పేరిట కోర్టులో కేసు దాఖలా చేసి గత 20 సంవత్సరాలుగా ఈ భూమిని వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 2006లో తేజ పవర్ ప్లాంట్, 2010లో గ్రీన్ బెల్ట్ ఏరియా, 2020లో యూనిట్4 ఫ్యాబ్రికేషన్ యాడ్, 2026లో డస్ట్ బిన్ గా మార్చి ఈ భూములను వినియోగిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయితే గడచిన ఐదేళ్లుగా ఈ భూమిలో సిమెంట్ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించిన ముడి సరుకును నిల్వ ఉంచినట్లు చుట్టూ ఉన్న గ్రామాలలోని పలువురు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో మిగిలిన వేస్ట్ మెటీరియల్ ఈ భూమిలోనే డంప్ చేసినట్లు సమాచారం. కాగా ఈ డంప్ లో ఎక్కువ మొత్తంలో ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రి ఉండడంతో వెలుగుతీతదారులకు ఇది ఆదాయ వనరుగా మారింది. ఈ భూముల్లో తవ్వకాలు జరిపి మరి పాత ఇనుమును వెలికి తీసి అమ్ముకుంటుండడం గమనార్హం.
వెలికితీతదారులపై కేసు? :
వారం రోజుల క్రితం ఇక్కడ ఇనుము వెలికి తీస్తున్న వారిపై సిమెంట్ పరిశ్రమ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆటోలో ఇనుము వేసుకొని వెళ్తున్న కొంతమందిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించి వీరిపై దొంగతనం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆ భూమి, ఆ ఇనుము మీదేనని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరడంతో పరిశ్రమ యాజమాన్యం గానీ, సిబ్బంది గానీ ముందుకు రాలేదని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
ఇనుము కోసం ఎగబడుతున్న జనం:
ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్ పాత ఇనుము నిల్వలు ఉండటంతో గత వారం రోజులుగా జనం డంప్ నుండి ఇనుమును వెలికి తీసేపనిలో పడ్డారు. రోజుకి 2 - 5 క్వింటాల వర కు ఇనుము వెలికి తీస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వెలికి తీసిన ఇనుమును పాత సామాన్ల కొనుగోలుదారులకు విక్రయించి రోజుకి రూ.5, 0 వేల వరకు డబ్బు ను సంపాదిస్తున్నట్లు సమాచారం. క్వింటా పాత ఇనుము ధర రూ.3 - 5వేల ఉండడంతో పాత ఇనుము కొనుగోలుదారులు ఏకంగా అక్కడే తూకాలు పెట్టి ఇనుము కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొందరు రాత్రింబవళ్లు ఇనుమును వెలికి తీసే పనిలోపడ్డట్లు తెలిసింది.
గత వారం రోజులుగా వెలికితీసిన ఇనుమును అమ్ముకొని ఒక కుటుంబం రూ.2.5లక్షల డబ్బు సంపాదించినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ వేస్ట్ మెటీరియల్‌లో నిల్వ ఉన్న పాత ఇనుము కొంద రికి ఆదాయ పునరుగా మారిందనలో ఇటువంటి సందేహం లేదు. అయితే ఈ భూమి భూదాన్ భూమి అని, సంవత్సరాల తరబడి సిమెంట్ పరిశ్రమ దీన్ని అక్రమంగా ఆక్రమించుకొని వినియోగిస్తుందని కొందరు స్థానికులు ఆరోపిస్తుండడం గమనార్హం.






