04-12-2025 12:07:57 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి అర్బన్, డిసెంబర్ 3: రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాలను నిబంధనలకు లోబడి పరి శీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని బూదకుర్ద్, చాకేపల్లి గ్రామాలకు బూదకుర్ద్ గ్రామపంచాయతీలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. నామినే షన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామి నేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ,
ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడ ల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితా లు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితా పూర్తి వివరాలతో రూపొందించాలని తెలిపారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జాగ్రత్త వహించాలని, విధు లు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని వెల్లడించారు.