calender_icon.png 4 December, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనురా సర్పంచ్ ఏకగ్రీవం

04-12-2025 12:09:04 AM

  1. 8 వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవ ఎన్నిక

జిల్లాల బోణీ కొట్టిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్3 (విజ యక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్ర మంలో భాగంగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ బోణి కొట్టింది. కెరమేరి మండలంలోని ధనోర గ్రామపం చాయతీ సర్పంచ్‌గా సిడం గంగు ఏకగ్రీవం అయ్యారు.సర్పంచ్ స్థానంతో పాటు ఎనిమిది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికవ్వ డం విశేషం.

మొదటి విడతలో భాగంగా బుధ వారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్ర మంలో నామినేషన్లు వేసిన పలువురు అభ్య ర్థులు ఎన్నికల బరిలో నుంచి వైదొలగడంతో ఒక్కోవార్డులో ఒకే అభ్యర్థి ఉం డడం ద్వారా ఎన్నిక ఖాయమైంది. ఏకగ్రీవం అయినా సర్పంచ్ సిడం గంగు, ఉప సర్పంచ్ సయ్యద్ అబ్దుల్ రిజ్వాన్, వార్డు సభ్యులు సోనేరావు ,వాసుదేవ్, రేవతి, బింబాయి, ధర్మ, అభిబ్ ఖాన్, ఫర్జనభిలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అభి నందించి శుభాకాంక్షలు తెలిపారు.