04-12-2025 12:06:45 AM
నిర్మల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ జనరల్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎస్సీఈఆర్టీ విభాగంలో హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు.
రోల్ ప్లే విభాగంలో పాఠశాలకు చెందిన శ్రీనిధి అభిజ్ఞా నేత శ్రీహిత చందన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలోని ప్రతిభ చాటించి ప్రథమ బహు మతి గెలుచుకున్నట్టు తెలిపారు వీరు జాతీయ స్థాయిలో పాల్గొన్నటూ వివరించారు. ప్రతిభ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డానియ ల్‌తో పాటు ఉపాధ్యాయులు సారిక కల్పనా మేరీ తదితరులు అభినందించారు.