15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్యారెంటీల అమలు జాప్యంతో వెతలు

02-11-2025 12:00 AM

ఫిరోజ్ ఖాన్ :

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కేవలం స్థానిక పోరు కాదు, రాష్ర్ట రాజకీయాలకు కీలక సంకేతమని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో 2023 తుది జాబితా ప్రకారం మొత్తం 4,01,365 మం ది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,08,561 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 1,92,779గా ఉంది. ఈ నియోజకవర్గంలో మూడు రకాల ఓటర్ల సమూహాలు ఉన్నా యి. అధిక అభివృద్ధి చెందిన ప్రాంతాల ఓటర్లు, స్థిరత్వం కోరుకునేవారు, బస్తీ ప్రాంతాల ఓటర్లు, సంక్షేమం ఆశించేవారు, నిర్ణయాత్మక ముస్లిం ఓటర్లు.

ఈ మిశ్రమ ఓటింగ్ కూర్పు, ఉపఎన్నిక ఫలితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాగంటి గోపీనాథ్  80, 549 ఓట్లు సాధించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 16,337 ఓట్ల మెజారిటీతో గెలుపొం దారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక గాలి వీచినప్పటికీ గ్రేటర్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలే వచ్చా యి. గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ తన 16,337 ఓట్ల ఆధిక్యాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

కాంగ్రెస్ ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వ అనుకూలతపై ఎక్కువగా ఆధారపడుతోంది. జూబ్లీ హిల్స్‌లో ముస్లిం ఓటర్లు గెలుపోటములను శాసించే సామర్థ్యం కలిగి ఉన్నారు. సంప్రదాయ ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య చీలిపోతాయి. అయితే, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అమలు చేసిన వ్యూహం అద్భుతంగా పనిచేసింది.

కీలకమైన ఎంఐఎం నాయకు లు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా, ముస్లిం ఓటర్లలో ఒక భాగం బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపడానికి స్పష్టమైన సంకేతం లభించినట్లయింది. అయితే ఈ ‘ఓటు బదిలీ’ ప్రక్రియ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారితే.. అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం తమ బలమైన మైనారిటీ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సవాల్‌గా మారిన హామీలు

రాష్ర్టంలో అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆరు గ్యారెంటీల హామీల అమలులో జాప్యం చేయడమే. ఆరు ప్రధాన హామీల్లో కీలకమైన వృద్ధులకు 4 వేల పింఛను, మహిళలకు 2,500 ఆర్థిక సహాయం ఇప్పటివరకు అమలు కాకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి ఓటర్లలో అసంతృప్తి పెరిగిపోయింది. 2023 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది.

డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల్లో తొలుత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచి త బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం సూపర్ సక్సెస్ అయిందని, ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుం డా అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టిందని ప్రభుత్వం పేర్కొంది. అధికారం లోకి వచ్చిన వెంటనే అత్యంత వేగంగా ఈ పథకాన్ని గ్రౌండ్ వర్క్ చేయడంతో ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని ప్రజలు భావించారు.

కానీ హామీల అమల్లో కొంత ఆలస్యం జరిగింది. రెండు వందల యూని ట్ల వరకు ఉచిత విద్యుత్తు అని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అందరికీ చేరలేదన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి. అడ్రస్ లు, ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడం మూలానా ఉచిత కరెంట్ పథకంలో కోత పెట్టారన్న విమర్శలు పెరిగిపోయాయి. 

ప్రతిపక్షాల ఆరోపణలు

ఇక రైతులకు రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని ప్రతిపక్షా లు ఆరోపణలు చేశాయి. రెండు లక్షల రుణం కొందరికే అందిందని, చాలా మం దికి ఇంకా రుణం మాఫీ కాలేదన్న ఆందోళనలు పెరిగిపోయాయి. లక్ష, రెండు లక్ష ల్లోపు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై ఉన్న రుణాలను మాఫీ చేయడంలో జాప్యం చేయడంతో కొంద రు రైతులు ఆందోళనకు కూడా దిగారు.

రైతు భరోసా నిధుల విడుదల కూడా అం తంత మాత్రంగానే జరగడంతో రైతులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇది కాంగ్రె స్ నేతలను టెన్షన్‌కు గురి చేస్తుంది. పథకాల అమలు చేస్తున్నారు సరే.. అందరికీ కాకుండా కొందరికే ఆ ఫలాలు అందుతుండడంపై సొంత పార్టీలోనే అసంతృ ప్తులు వినిపిస్తుండడం ఆలోచించాల్సిన అంశం. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో బీఆర్‌ఎస్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నప్పటికీ ఆరు గ్యారెంటీల హామీల అమలు అటకెక్కించిందంటూ ప్రచారంలో ఊదరగొట్టేస్తున్నాయి. అంతేకాదు రెండేళ్ల కాంగ్రె స్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కేటీఆర్ తన ప్రచారంలో బలంగా ప్రస్తావిస్తూ, ‘నిలకడ అభివృద్ధి కొనసాగింపు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు గా అనిపిస్తున్నది.ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకు చీలిక బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారేందుకు అవకాశం లేకపోలేదు. 

పట్టం ఎవరికీ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పక్షాన ప్రచారంలో కనిపించిన ఆలస్యం, నిదానాన్ని రాజకీయ విశ్లేషకులు ‘రాజకీ య బద్దకం’గా పరిగణిస్తున్నారు. బీఆర్‌ఎ స్ మొదటి నుంచి దూకుడుగా, వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తోంది. స్థాని క సంస్థల నాయకుల మద్దతును కూడగట్టుకుంది. కాంగ్రెస్ ప్రచారం కేవలం అధి కార అనుకూలతపై అతిగా ఆధారపడడం తో, స్థానిక ఓటర్ల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయింది.

దీనికి తోడు, బీఆర్‌ఎస్ అభ్యర్థికి నియోజకవర్గం లో ఉన్న వ్యక్తిగత విశ్వసనీయత, ‘హాట్రిక్ విజయం’ సెంటిమెంట్ కూడా బీఆర్‌ఎస్ కు అదనపు బలాన్ని చేకూర్చాయని చెప్పొ చ్చు. పైన వివరించిన 4,01,365 మంది ఓటర్ల సంఖ్యా బలం, ముస్లిం ఓటర్లలో వచ్చిన సానుకూల ధోరణి, కాంగ్రెస్ హామీ ల అమల్లో ఉన్న జాప్యం వంటి అంశాల ను సమగ్రంగా విశ్లేషించి చూస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌కు కాస్త మెరుగైన అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మాగంటి గోపీనాథ్ సాధించిన 16,337 ఓట్ల మెజారిటీని నిలబెట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు సవాలే అయినప్పటికీ, కేటీఆర్ వ్యూహం, ముస్లిం ఓటు బదిలీ అంశాలు గులాబీ పార్టీ విజయానికి దోహదపడతాయేమో చూడాలి. అయితే జూబ్లీ హిల్స్ ఓటర్లు ‘అభివృద్ధి కొనసాగింపు’ నిలకడను ఎంచుకుంటారా లేదా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి హస్తం పార్టీకే పట్టం కడతారా అన్నది నవంబర్ 14న తేలిపోనుంది. 

 వ్యాసకర్త సెల్: 9640466464