18 July, 2026 | 10:08 AM

భారత్‌లో రెండో బర్డ్‌ఫ్లూ కేసు

13-06-2024 12:48 AM

బెంగాల్‌లో నాలుగేళ్ల చిన్నారికి నిర్ధారణ

అధికారికంగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ, జూన్ 12: పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల చిన్నారికి హెచ్9 ఎన్2 బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెవో) ప్రకటించింది. ఇది భారత్‌లో రెండో మానవ కేసుగా పరిగణించినట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని నాలుగేళ్ల బాలుడు కొద్దినెలల క్రితం జ్వరం, జలుబు, శ్వాస కోశ సమస్యలు, పొత్తికడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

వైద్యులు చిన్నారికి చికిత్స అందించగా అతడి ఆరోగ్యం కుదటపడింది. ఆ తర్వాత మూడు నెలలకు చిన్నారికి హెచ్9ఎన్2 బర్డ్‌ఫ్లూ సోకినట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. చిన్నారి పౌల్ట్రీలకు సమీపంలో ఉండటమే వ్యాధి సోకడానికి కారణమని వెల్లడించింది. బాధితుడి కుటుంబంలో మరెవ్వరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించలే దని, అతడికి ఇప్పటివరకు వేయించిన టీకాలకు సంబంధించిన వివరా లు అందుబాటులో లేవని, ఈ కేసుపై అధ్యయనం చేస్తున్నామని వివరించింది. 2019లో భారత్‌లో మొదటిసారిగా ఓ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కాగా, తాజాగా రెండో కేసు బయటపడిందని తెలిపింది.