ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను మృతి
ఐదుగురు జవాన్లు, పోలీసు అధికారికి గాయాలు
మేమే దాడి చేశామని కశ్మీర్ టైగర్స్ వెల్లడి
శ్రీనగర్, జూన్ 12 : జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. ఈ దాడు ల్లో ఐదుగురు సైనికులు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఎన్‌కౌంటర్లు బుధవారం ఉద యం వరకు కొనసాగాయి. జమ్మూ జోన్ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆనంద్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. “అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని కథువాలో ఓ ఇంటిపై ఉగ్రవాదులు మంగళ వారం రాత్రి దాడులు చేశారు.
ఈ దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొనగా, వారిలో ఒకరు ఎదురు కాల్పుల్లో మరణించారు. మరో ఉగ్రవాది అత్యాధునిక M4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్‌తో అడవిలోకి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పల్లో మరణించాడు” అని పేర్కొ న్నారు. కాగా, ఉగ్రదాడిని అక్రమ చొరబాటుగా ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ పేరెత్తకుండానే పరోక్షంగా ఆ దేశంపై విమర్శలు చేశారు. మన దేశంలోని శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు పొరుగుదేశం ఎప్పుడూ ప్రయత్నిస్తోందని, తాజా దాడి అందులో భాగమేనని స్పష్టం చేశారు.
ఉగ్రవాదిపై రూ. 20 లక్షల రివార్డు
రెండ్రోజుల క్రితం రియాసీలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి మరువక ముందే మరో దాడి జరగడం కలకలం రేపుతోంది. ఈ ఉగ్రదాడిలో 9 మంది మరణిం చగా.. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్ర తా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. 11 టీమ్‌లుగా విడిపోయి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇది లా ఉంటే, రియాసీలో యాత్రికుల బస్సుపై దాడి జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. అతడి సమాచారం ఇస్తే రూ. 20 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులు తెలి పిన వివరాల ఆధారంగా ఉగ్రవాది స్కెచ్‌ను విడుదల చేశారు.
దాడి చేసింది మేమే!
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడి మా పనే అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కశ్మీర్ టైగర్స్ గ్రూప్ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు, ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలిం పు చర్యలు చేపట్టాయి. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్నా యి. రియాసీ, కథువా తర్వాత దోడాలో ఉగ్రదాడి జరగడం కలకలం రేపుతోంది.






