16 April, 2026 | 4:47 AM

జంటగా రెండో సినిమా..

17-06-2025 12:00 AM

కలర్‌ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి హిట్లతో హీరో సుహాస్ తనదైన ముద్ర వేశారు. కాగా, తాజాగా ఆయన మరో కొత్త చిత్రం మొదలైంది. గతంలో సుహాస్‌తో కలిసి నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫేమ్ శివాని నాగారం ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ తాజా చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ గోపి అచ్చర తెరకెక్కిస్తున్నారు.

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్రరెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన అవుట్‌అండ్‌అవుట్ ఎంటర్‌టైనర్. ‘రైటర్ పద్మభూషణ్’తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి  ప్రముఖ దర్శకుడు నాగ్‌అశ్విన్, హీరో సత్యదేవ్, వంశీ నందిపాటి అతిథులుగా హాజరయ్యారు.

ఈ చిత్రంలో సుహాస్ హిలేరియస్ క్యారెక్టర్ పోషించనుండగా నరేశ్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డీవోపీ: మహిరెడ్డి పండుగల; ఎడిటర్: విప్లవ్ నిషాదం; ఆర్ట్: ఏ రామ్‌కుమార్.