17 June, 2026 | 4:32 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

‘విశ్వం’ నుంచి హార్ట్ టచ్చింగ్ సెకండ్ సాంగ్ రిలీజ్

25-09-2024 04:14 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను దోనేపూడి చక్రపాణి స‌మ‌ర్ప‌ణ‌లో చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్ మీడియా బ్యాన‌ర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా'కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. మంగ‌ళ‌వారం ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. 

'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.  మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.