calender_icon.png 4 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహస్యంగా రంగు నీళ్ల పంచాయితీ

04-12-2025 01:17:04 AM

  1. హెటిరో పరశ్రమతో ప్రాణాలకు ముప్పు

పంటలను, ఆరోగ్యాన్ని కోల్పోయామని ఆవేదన 

కంపెనీ యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కయ్యారని నిరసన

సమావేశాన్ని బహిష్కరించిన గ్రామస్తులు 

గుమ్మడిదల, డిసెంబర్ 3 :గుమ్మడిదల మండలం దోమడుగులోని హెటిరో పరిశ్రమ వ్యర్థ జలాల వల్ల నల్లకుంటను ఎర్ర కుంటగా మార్చి రైతుల పంటలకు తీరని నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈ వి షయంలో పరిశ్రమ యాజమాన్యంతో బుధవారం నాడు గుమ్మడిదల ఎంఈవో కార్యాలయంలో తహసీల్దార్ పరమేశం, మున్సిప ల్ కమిషనర్ దశరథం, గ్రామానికి చెందిన ముఖ్యులతో కలిసి రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశారు.

పరిశ్రమ వ్యర్థ జలాలతో నష్టపోయిన వ్యవసాయ పంట పొలాల రైతులకు నష్టపరిహారం అందించాలని, పాడి పశువులు మృతి చెందిన యజమానులకు పరిహారం ఇవ్వాలని, అలాగే గ్రామం లో ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిగణంలోకి తీసుకొని కార్పొరేట్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పరిశ్రమ ప్రతినిధిలు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను పరిగణంలోకి తీసుకొని ప్రభు త్వం ద్వారా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన తర్వాత ఆసుపత్రిలో పరికరాలను, మందులను పరిశ్రమ యాజమాన్యం సమకూరుస్తుందన్నారు.

అయినప్పటికీ జీవితకాలం మా పిల్లలకు ఇలాంటి చెడు దు ర్వాసనలు వెదజల్లే పరిశ్రమల వల్ల ముప్పు ఉన్నందున తాము ఒప్పుకోవడం లేదంటూ మరొక వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తహసిల్దార్ పరిశ్రమ యాజమాన్యంతో కుమ్ముకై గుమ్మడిదల ఎంఈఓ కార్యాలయంలో రహస్యంగా పంచాయితీ ఏర్పాటు చేయడం పట్ల నాయకులు బాల్ రెడ్డితో పాటు పలువురు గ్రామ యువకులు ఆగ్రహంతో పంచాయితీని బహిష్కరించి బయటకు వెళ్తూ అధికా రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ లక్ష్మికాంతరెడ్డి చొరవ తీసుకొని నిరసనలు చేయవద్దని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని చెప్పడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.