23 July, 2026 | 1:53 AM

టీచర్ల కృషితో రాష్ట్రంలో మూడో స్థానం

23-07-2026 12:00 AM

డీఈవో యాదయ్య

పెద్దమందడి, జూలై 22: ఎఫ్‌ఎల్‌ఎన్ అ మలులో వనపర్తి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం ఉపాధ్యాయుల కృషి ఫ లితమని డీఈవో యాదయ్య అన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లి జంగమాయా పల్లి హైస్కూల్‌లో జరుగుతున్న మూడు రో జుల గణిత, ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణ రెండో రోజు ఆయన జిల్లా మానిటరింగ్ అ ధికారి మహానంది తో కలిసి పరిశీలించారు.

శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థంగా అమలు చేసి వనపర్తి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అటల్ ట్వింకరింగ్ ల్యాబ్, బడి తోటను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎస్. మంజులత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.