అరెస్టులతో పోరాటాన్ని అడ్డుకోలేరు
23-07-2026 12:00 AM
రాయిచూర్ రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే జియంఆర్
చిన్న చింత కుంట, జూలై 22 : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఇది సరైన పద్ధతి కాదంటూ నిరసన తెలిపిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం దారుణమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
బుధవారం చిన్నచింతకుంట మండలం లాల్ కోట ఎక్స్ రోడ్ సమీపంలోని రాయిచూర్ హైవేపై ఎమ్మెల్యే జియంఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్రం లో గద్దె దింపే పరిస్థితి దగ్గర లో ఉందని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.






