calender_icon.png 13 November, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంపతులకు భద్రత.. భరోసా

13-11-2025 12:03:53 AM

ఎస్పీ జానకి షర్మిల కృషితో 123 జంటలను కలిపిన పోలీస్ శాఖ 

నిర్మల్, నవంబర్ (విజయక్రాంతి): చేతి లో లాటి, నెత్తిపై టోపీ, నడుముకు పిస్తోలు, సూటు బూటు గాంబిర్యం ఇది పోలీసులకు ఉండే లక్షణం, అందుకే పోలీసులు అంటే ఒకప్పుడు భయం వణుకు ఉండేది. కానీ కాఠినం గా ఉండే ఖాకీలు కరుణామూర్తులని నిర్మల్ పోలీస్ శాఖ దాంపత్య జీవితానికి భరోసా కల్పించి భద్రత ఇస్తూ విడిపోయిన కుటుంబాలను భరోసా కేంద్రం ద్వారా ఒకటిగా చేసి ఆ ఇంటిలో దీపం చిగురింపచేస్తున్నారు, సమస్య ఏదైనా దానికి పరిష్కారం ఉంటుందని భరో సా కల్పిస్తూ కుటుంబ గొడవల వల్ల విడిపోయిన జంటలకు కౌన్సిలింగ్ ద్వారా ఇద్దరిలో మార్పు తెచ్చి దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉండేలా ప్రోత్సహిస్తూ నిర్మల్‌లో భరోసా సెంటర్ భద్రత కల్పిస్తోంది.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలి ఐపీఎస్ అధికారి డాక్టర్ జానకి షర్మిల నిర్మల్‌లో 12 జనవరి, 2024లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. జిల్లా షీ టీం కు అనుబంధంగా భరోసా సెంటర్‌ను ఏర్పాటుచేసిన ఎస్పీ..  అందులో ముగ్గురు ఎస్సైలు ఒక ఏఎస్‌ఐ మహిళ పురుషులు మరో ఐదుగురు మహిళా కానిస్టేబుల్ భరోసా సెంటర్‌ను నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తం గా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య వారి కుటుంబ సభ్యుల మధ్య వచ్చి న మనస్పర్ధలు నేపథ్యంలో విడిపోదామనుకున్న దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఏకం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

భరోసా కేంద్రం ధర భద్రత

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల పాత హాస్టల్ భవనంలో రెండేళ్ల క్రితం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీంకు అనుబంధంగా భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ప్రారం భించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసుల ప్రజావాణిలో భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవ లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ రావడంతో వాటి పరిష్కారం దిశగా ఈ భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో భార్యాభర్తల కుటుంబ సభ్యు ల మధ్య వచ్చిన వివాదాల పరిష్కారానికి సంబంధించిన ఫిర్యాదులను భరోసా సెంటర్ కు పంపుతున్నారు. ఇక్కడ భార్యాభర్తల గొడవలకు కౌన్సిలింగ్ ఇప్పించి చట్టపరమైన చర్య లు నేపథ్యంలో కలగబోయే పరిణామాలను గొడవల వల్ల కుటుంబ సభ్యులపై పిల్లలపై పడే ప్రభావం తదితర వాటిని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

ఎస్‌ఐతో పాటు ఏఎస్‌ఐలు ప్రత్యేక శిక్షణ పొందిన సిటీ మహిళా సభ్యులు అవసరమైతే మహిళా న్యాయవాదులు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు భరోసా సెంటర్‌కు నిర్మ ల్ జిల్లాలో 231 దరఖాస్తుల రాగా 110 జంటలను తిరిగి దాంపత్య జీవితాన్ని గడిపేలా కౌన్సిలింగ్ పూర్తి చేశారు మరో 110  కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు 170 మీ కేసులు న్యాయవిచరణ జరిపిస్తున్నా రు 43 కేసులు మాత్రం పెండింగ్లో ఉన్నాయి ఈ కేసుల్లో ఎక్కువగా 20 సంవత్సరాల నుం చి 35 సంవత్సరాలు లోపు యువ దంపతుల వి. దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి ప్రతిరోజు ఇంట్లో కొట్లాటలు జగడాలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ నిర్వహించి ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ యువ జంటలో వారి కి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వారు విడాకుల వరకు వెళ్లకుండా ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పిలిపించి వారి పిల్లలకు భద్రత భరో సా ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. మళ్లీ గొడవ లు జరగకుండా అంగీకర పత్రం రాయించుకుంటున్నారు. 

ఒక్కొక్క కుటుంబానికి నాలు గైదు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖ వారికి హెచ్చరికలు జరిచేస్తూ దాంపత్య జీవితం సుఖ ప్రయాణానికి భరోసా కల్పిస్తున్నారు. ఇందుకోసం 100 డైల్ నెంబర్‌తో పాటు ఫోన్ నెంబర్ 8712659550 అందుబాటులో ఉంచి 24 గంటలు ఇక్కడ ఏ సమస్య ఏర్పడ్డ అక్కడికి సంబంధిత ఎస్సై మహిళా పోలీసులను పంపి భరోసా ఇస్తున్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అనేక మంది దంపతులకు భరోసా కల్పించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చాలా సంతోషంగా ఉంది

నిర్మల్ జిల్లాలో భరోసా కేంద్రం ద్వా రా ఇప్పటివరకు 110 దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి తిరి గి వారి వైవాహిక జీవితం ఆనందంగా గడిపేందుకు భరోసా కల్పించాం. ఇప్పటివరకు 131 దరఖాస్తులు రాగా 110 మం దిని తిరిగి కల్పించగా మిగతావి న్యాయ నిపుణులు సలహాతో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో చిన్న చిన్న కారణాలకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయకుండా కౌన్సిల్ ద్వారా వాటిని పరిష్కరించడం వారు సహకరించడం సంతోషంగా ఉంది.

- జానకి షర్మిల, ఎస్పీ 

కలుస్తామని అనుకోలేదు..

నిర్మల్ పట్టణంలోని బాలాజీవాడ మాది. మాకు 20 ఏళ్లలోపే పెళ్లి జరిగింది ఒక పాప కూడా ఉంది. ఇంట్లో చిన్న చిన్న కారణాలవల్ల మా ఇద్దరి మధ్య వివాదం ఏర్పడి ఒకరిపై ఒకరు గొడవ పడుతూ న్యాయం కోసం పోలీస్ స్టేష న్‌కు వెళ్లినం. పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇద్దరిని పిలిపించి గొడవలకు కారణాలు తెలుసుకొని మా కుటుంబ సభ్యులతో మాట్లాడి మా ఇద్దరిని కలిపి భరోసా ఉంటామని హామీ ఇవ్వడంతో తిరిగి దాంపత్య జీవితం కొనసాగిస్తున్నాం. చాలా సంతోషం అనిపించింది.

పోశెట్టి లక్ష్మి దంపతులు

న్యాయ సేవ సంస్థ ద్వారా కూడా భరోసా..

నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బలస సెం టర్లో దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు కారణాలతో విడిపోయిన కుటుంబాలను కౌన్సిలింగ్ నిర్వహించి కలపడం చాలా సంతోషంగా ఉంది. న్యాయమూర్తిగా ఫ్యామిలీ కోర్టులో వచ్చిన కేసుల్లో భార్యాభర్తలు మధ్య ఉన్న విభేదాలపై విచారణ జరిగినప్పుడు కొన్ని సందర్భంలో బాధ కలిగేది వారికి కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయ సేవ సంస్థ ద్వారా వినకపోతే చట్టపరమైన ఇబ్బందులను తెలియజేసి పరిష్కరించుటకు కృషి చేస్తు న్నాం. పోలీస్ శాఖ ముందుకు వచ్చి భరోసా కల్పించడం పట్ల జిల్లా ఎస్పీని అభినందిస్తున్నాం.

 శ్రీమతి శ్రీవాణి, జిల్లా జడ్జి

కన్నీళ్లు వస్తున్నాయి..

పోలీస్ స్టేషన్లో దంపతులిద్దరూ ఇంట్లో గొడవపడి పోలీస్ స్టేషన్‌కు వచ్చి మా ముందే ఒకరిపై ఒకరు తిట్టుకుంటారు. వారిద్దరిని పిలిచి గొడవకు కారణాలు అడిగినప్పుడు చిన్న చిన్న కారణాలే. నేను 2024లో ఎస్సైగా ఎంపికయ్యా.. నాకు అంత అనుభవం లేదు, అయినప్పటికీ ఎస్పీ జానకి షర్మిల స్ఫూర్తిని తీసుకొని దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారు చెప్పిన మాటలకు కోసారి కన్నీళ్లు వచ్చిన దిగమించుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

- సుప్రియ, ఎస్సై