calender_icon.png 13 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం... రైతుకు మేలు చేసే సర్కార్

13-11-2025 12:01:56 AM

  1. అప్రమత్తంగా ఉండి రైతుకు జవాబుదారితనంగా ఉండాలి                                 

రాబోయే రోజుల్లో మంథనిలో మరింత మార్పు తెస్తాం

మంథని లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని నవంబర్ 12 (విజయ క్రాంతి) కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని...రైతులంటేనే కాంగ్రెస్ అని... రైతుకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం అద్వర్యంలో బుధవారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని అంగులూరులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్నలతో కలిసి ప్రారంభిoచారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్ద ఎత్తున వరి ధాన్యం సేకరణ చేపడుతున్నoదున రైతుకు జవాబు దారి తనంగా ఉండి పనిచేయాలని అన్నారు. ధ్యాన్యం అమ్ముకోవడం లో రైతు పడుతున్న కష్టాన్ని గుర్తిoచి ఆనాడు తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ గ్రామానికి ధ్యానం కొనుగో లు కేంద్రాలను తీసుకువచ్చామని, సన్న వడ్లను పండించే రైతును ప్రోత్సహిచేందుకు మద్దతు ధరతో పాటు క్విoటాల్ కు రూ. 500 బోనసు చెల్లిస్తున్నామని, అలాగే మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో మరిన్ని సౌకర్యాలు కల్పించి మరింత మెరు గు పరుస్తామని అన్నారు.

రాబోయే మంథనిలో మరింత మార్పు చూస్తారని మంత్రి తెలిపారు.  తడిసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. రైతులు మంత్రి శ్రీధర్ బాబును గజ మాలతో సత్కరించి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమం లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, ఉడుత మాధవి- పర్వతాల్ యాదవ్, దాసరి లక్ష్మి-మొండయ్య, టీజీఈఆర్సి సలహాదారు శశిభూషణ్ కాచే, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ అనిల్ కుమార్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ,

మాజీ ఎంపిపి కొండ శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు తోట్ల తిరుపతి, పెరవేన లింగ య్య, జనగామ నర్సింగ రావు, మూల పురుషోత్తం రెడ్డి, శ్రీరాంబట్ల శ్రీనివాస్, అజీo ఖాన్, లైశెట్టి రాజు, పెంటరి రాజు, పెరుగు తేజ పటేల్, కొట్టే పద్మ, ఆరెల్లి కిరణ్ గౌడ్, గుండా పాపారావు, వేల్పుల రాజు, పోలు శివ, నాంపల్లి సతీష్, చంద్రు రాజమల్లు, నక్క నాగేంద్ర, పలువురు జిల్లా, మండల అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.