13-11-2025 12:04:44 AM
పెద్దపల్లి, నవంబర్ 12(విజయ క్రాంతి) పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ కుమారుడు విశ్వతేజ్ బుధవారం మరణించగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విశ్వతేజ్ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఈర్ల స్వరూప సురేందర్ ను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపి ఆ భగవంతుడు.
ఈర్ల స్వరూప సురేందర్ మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్న అనంతరం అంతిమయాత్రలో ఎమ్మెల్యే విజయరమణ రావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.