28 August, 2026 | 7:33 PM

Breaking News

రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •   మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు   •   మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగులకు హక్కుల సాధన   •  

రుద్రమదేవి షోటోకాన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ సమ్మర్ క్యాంప్

26-06-2026 12:00 AM

శిక్షణ పొందిన పిల్లలకు సర్టిఫికెట్ల అందజేత

సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ముషీరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్ నగర్ లోని జనతా పార్క్ లో కరాటే మాస్టర్ కే. నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుద్రమదేవి షోటోకాన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ వేసవి శిక్షణా శిబిరంలో  సమ్మర్ క్యాంప్ శిక్షణ పొందిన పిల్లలకు సర్టిఫికెట్ లను బుధవారం అందచేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, షోటోకాన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ పూర్తి చేసుకునీ తమ ప్రతిభ కనబరిచిన పిల్లలకు సర్టిఫికెట్ లను అందచేసారు.

ఆయన మాట్లాడుతూ, షోటోకాన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణతో పిల్లలకు ఆత్మరక్షణలో పాటు శరీర ధారుడ్యం, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ఇలాంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్న రుద్రమదేవి షోటోకాన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ సంస్థ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ ఎన్.లక్ష్మి, చీఫ్ ఎగ్జామినర్ డా‘ రవి, జి.నర్సింగ్, నిజాంభాయ్, వెంకట్ తదితరులు  పాల్గొన్నారు.