డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కే శివసేనారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయ కం, అందరూ ఆయన అడుగుజాడల్లో నడి చి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హా ల్లో షెడ్యూల్ కాస్ట్ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్ర మానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు లు డా. జి. చిన్నా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కే. శివసేన రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అ తిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పలువురు కళాకారులు అంబేద్కర్ జీవితం పై పాటలు ఆలపించి ఆకట్టుకున్నా రు. అనంతరం ముఖ్య అతిథులు అంబేద్కర్ జీవితం, ఆయన ఆశయాలు, సామాజిక స మానత్వం కోసం చేసిన కృషి గురించి ప్రసంగించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం విద్యా ద్వారానే అంటరానితనం అస్పృశ్యతను దూరం చే యవచ్చని నమ్మారన్నారు. ఆయన ఆ రోజుల్లోనే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లైబ్ర రీలో అన్ని పుస్తకాలు చదివిన ఘనతను సా ధించారన్నారు.
దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేసినట్లు తెలిపారు. ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంటి మొత్తానికి జ్ఞానాన్ని పంచుతుందని కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు శాలువా, మెమోంటోతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థాని క సంస్థలు ఖీమ్య నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్డీవో సుబ్రహ్మ ణ్యం, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మహనీయుల ఉత్సవ కమి టీ అధ్యక్షులు గంధం నాగరాజు, ఉపాధ్యక్షులు చిరంజీవి, సభ్యులు, ఎస్సీ ఎస్టీ విజిలె న్స్ కమిటీ సభ్యులు, కళాకారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థు లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






