17 August, 2026 | 12:44 AM

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

17-08-2026 12:13 AM
  1. 310 క్వింటాళ్లు.. సుమారు రూ.12 లక్షల విలువ. 
  2. ఆరుగురుపై కేసు నమోదు 
  3. కొరఢా జులిపించిన పాల్వంచ పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 16 ,(విజయక్రాంతి.): నిరుపేదల కడుపు నింపవలసిన రేషన్ బియ్యం అక్రమార్కుల పరమై లారీలో జిల్లా సరిహద్దులు దాటుతున్న ట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు.

పాల్వంచ నుంచి మిర్యాలగూడకు టీఎస్ 05 యం    సి 1889 లారీలో రూ 12 లక్షల విలువ గల 310 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా నిఘా వేసి అనుమానాస్పదంగా తరలి వెళ్తున్న లారీని పట్టుకొనీ తనిఖీ చేయగా రేషన్ బియ్యం గా గుర్తించి లారీని స్టేషన్కు తరలించారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

పేదల బియ్యం పై అక్రమార్కుల కన్ను 

జిల్లావ్యాప్తంగా పేదలకు రాయితీపై ప్ర భుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొం దరు అక్రమార్కులు తక్కువ ధరకు కనుగో లు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి పట్టణం, గ్రామీణ ప్రాం తాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో నిల్వ చేసిన అనంతరం ఇతర ప్రాంతాలకు తరలించి దండుకుంటున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం పాల్వంచ నుంచి మిర్యాలగూడ కు భార్యగా బియ్యం తరలిస్తుండగా పట్టుబడ్డ అక్రమ రేక్షణ బియ్యం దందా వెలుగు చూసింది. 310 క్వింటాల బియ్యం పట్టుబడటంతో అక్రమ రవాణా వె నక ఉన్న సరఫరాదారులు, బియ్యం ఎక్కడనుంచి సేకరించారు, ఎక్కడికి తరలించి ఎ వరికి చేరవేస్తున్నారని ఆరోపణలపై పోలీసులు దృష్ట సారించారు.

రైస్ మిల్లు నుంచి తరలింపు? 

పాల్వంచ పట్టణంలోని ఓ రైస్ మిల్లు ను ంచి అక్రమంగా బియ్యం తరలించినట్లు అ నుమానిస్తున్నారు. ప్రధానంగా బియ్యం ర వాణా పత్రాలు, వాహన వివరాలు, సరకు యజమాని వివరాలపై ఆరా తీస్తున్నారు. పాల్వంచ సి ఎస్ సతీష్ ఆదేశాల మేరకు ప ట్టణ ఎస్సై నాగరాజు విచారణ కొనసాగిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తుల ద్వారా బియ్యం రవాణా సూత్రధారుల వివరాలను సేకరిస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పాల్వంచ సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.