18 August, 2026 | 3:11 AM

రేషన్ బియ్యం పట్టివేత

18-08-2026 02:07 AM

తాడ్వాయి, ఆగస్టు, 17 (విజయక్రాంతి): ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు అక్రమంగా తరలిస్తూ అక్రమార్జునకు పాల్పడుతున్నారు. తాడ్వా యిలో సోమవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో రేష న్ బియ్యాన్ని గుర్తించారు.

లింగంపేటకు చెందిన సంగన్నగారి భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి 7 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయ మై తాడ్వాయి ఎస్సై నరేష్ కారును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలిం చా రు. పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు కొనసాగిస్తున్నారు.