calender_icon.png 1 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాలను సహించేది లేదు

21-04-2024 01:38:12 AM

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : తప్పుడు నివేదికలు ఇచ్చి అసైన్డ్ భూమి కబ్జాకు కారకులైన అధికారులపై చర్యలు తప్పవని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జాకు గురైన బాలనగర్ మండల పరిధిలోని పెద్ద చెరువు భూమి వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరిం చారు. అసైన్డ్ భూమి విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రె స్ నాయకులు పాల్గొన్నారు.