18 March, 2026 | 10:28 PM

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

18-03-2026 12:00 AM

భూత్పూర్, మార్చి 17 : మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశా లలో మంగళవారం సపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు చక్క గా ముస్తాబై ఉపయు క్తమైన బోధనోపకరణాలతో ఉపాధ్యాయులుగా పాఠాలను చక్కగా బోధించారు. హెచ్‌ఎంగా తక్షిత్, డీఈవోగా ఐశ్వర్య, ఎంఈఓ గా భాను శ్రీ, కాంప్లెక్స్ హెచ్‌ఎం గా రేవంత్ ఆయా పాత్రలు చక్కగా నిర్వర్తించారు.

ఈ సందర్భంగా 16 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్రలు పో షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దస్తయ్య ఉపాధ్యాయులు యాద య్య పద్మమ్మ సాయి రమాదేవి పద్మావతి నీరజ ఏఏపిసి చైర్మన్ అమృతమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమంగా బోధించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.