15-11-2025 12:18:49 AM
-ఆరంభ దశలోనే గుర్తించి నివారించవచ్చు
-మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
-రోగులకు ప్రత్యేక క్లినిక్స్ షురూ
హైదరాబాద్, నవంబర్ 14(విజయక్రాం తి):తెలంగాణలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఇటీవల ఆందోళనకరంగా పెరుగుతున్నాయి, ముఖ్యంగా 35 సంవత్సరా ల మధ్య వయస్సు గల వారిలోనే కేసుల సంఖ్య గణనీయంగా అధికమవుతున్నట్టు మెడికవర్ హాస్పిటల్స్ వెల్లడించింది.
సైలెంట్ కిల్లర్‌గా పిలువబడే ఈ వ్యాధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనబడకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. మెడికవర్ వైద్యవర్గం పరిశీలనలో అనూహ్యంగా ఆరోగ్యంగా కనిపించే రోగులు కూడా అధునాతన దశ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చే రుతున్నట్లు వెల్లడైంది. సాధారణంగా కడుపునొప్పి, బరువు తగ్గడం, జాండీస్, జీర్ణ సమ స్యలు వంటి లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి తీవ్రస్థాయికి చేతుంటుంది.
ప్రతి సంవత్సరం భారత్‌లో సుమారు 15వేల ప్యాంక్రి యాటిక్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య పెరగడానికి ఆధునిక జీవనశైలి, ఎక్కువసేపు కూర్చునే పని, అనారోగ్యకర ఆహారం, ఊబకాయం, డయాబెటిస్, ధూమపానం, మద్యపానం ప్రధాన కారకాలు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా 80% మంది రోగులు ఆలస్య దశలోనే వైద్యసేవలు పొందడం చికిత్స ఫలితాలను ప్రభావితం చేస్తోంది.
ఈ నేపథ్యంలో, మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఈ క్లినిక్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ, హెపటో-ప్యాంక్రియో- బిలియరీ శస్త్రచికిత్స నిపుణులు సమగ్ర రూ పంలో కలిసి పనిచేస్తున్నారు. ఈ బృందంలో డా.కృష్ణగోపాల్ భండారి, డా.సంతోష్ ఎం. నారాయణ్కర్, డా.అజయ్ శేషరావుషిండే వంటి మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఆరంభ దశలో గుర్తింపు, వేగవంతమైన నిర్ధారణ, వ్యక్తిగతీకరించిన అధునాతన చికిత్స అందించడ మే క్లినిక్ లక్ష్యం. మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. పవన్ అడ్డాల మాట్లాడుతూ యువతలో ఇలాంటి క్యాన్సర్ కేసులు గణనీ యంగా పెరుగుతున్నాయన్నారు. వీటిపై అవగాహనకు శిక్షణ కార్య క్రమాలు నిర్వహిస్తోంది అన్నారు.