1 September, 2026 | 11:29 AM

మార్చిలోపు వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

14-03-2025 12:08 AM

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ జే శ్రీనివాసరావు

పటాన్ చెరు, మార్చి 13 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మార్చి నెల లోపు ఆస్థి పన్నలు వందశాతం వసూలు చేయాలని హైదరాబాద్ రీజియన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ జే శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. గురువారం తెల్లాపూర్ మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ సంగారెడ్డి, వార్డు ఆఫీసర్స్, బిల్ కలెక్టర్ లతో ఆస్థి పన్నుల వసూళ్లపై ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 62.70 శాతం మాత్రమే ఆస్థి పన్ను వసూలు అయిందని, మిగిలిన 17 రోజుల్లో వంద శాతం వసూలు చేయాలని సూచించారు. తక్కవు కలెక్షన్స్ చేసిన బిల్ కలెక్టర్ లను కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్థిరాస్థి యజమానులతో సానుకూలంగా మాట్లాడి పన్నులు వసూలు చేయాలన్నారు.

వసూలైన ఆస్థి పన్నుల ద్వారా పట్టణ పరిధిలో మౌళిక వసతుల కల్పన, రోడ్లు డ్రైనేజీ, వీధి దీపాలు తదితర పనులు చేపడుతామని ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాత బకాయిలతో పాటు ప్రస్తుత ఆస్థి పన్ను మొత్తం వసూలుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎల్ ఆర్ ఎస్ ప్రోగ్రెస్  గురించి వివరాలను కమిషనర్ సంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ  సమీక్షలో మున్సిపల్ ఆర్వో వెంకటరామయ్య, మేనేజర్ అఖిల్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ అశోక్, బిల్ కలెక్టర్ లు గణేశ్, భిక్షపతి, ఆంజనేయులు, స్పప్న, స్వరూప, రెడ్డెమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.