calender_icon.png 6 July, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఎస్‌ఈలో సెమిస్టర్ విధానం

18-07-2024 12:05:00 AM

ఏడాదికి రెండుసార్లు పది, 12వ తరగతుల్లో బోర్డు పరీక్షలు

కేంద్ర విద్యాశాఖ కసరత్తు

న్యూఢిల్లీ, జూలై 17: సీబీఎస్‌ఈ  పది, 12వ తరగతుల్లో సెమిస్టర్ విధానం అమలు చేసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా విధి విధానాలు రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రముఖ విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌తో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నది. 2025 నుంచి ఈ విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 12వ తరగతి పరీక్షలపై ఇప్పటికే ఓ నిర్ణయాన్ని వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై ఇప్పటికే జాతీయ మీడియాలో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. సెమిస్టర్ విధానంపై సీబీఎస్ అధికారులు, విద్యాసంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ఆ కథనాల ద్వారా వెల్లడవుతోంది. దీంతో ఎప్పటిలాగే ఫిబ్రవరి మార్చిలో 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించి, ఫెయిల్ అయిన వారి కోసం జూన్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని నిపుణులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి  మార్చిలో బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. మే నెలలో పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నది.