17 April, 2026 | 3:03 PM

బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

24-12-2025 07:26 PM

టీపీసీసీ డెలికేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు

కోదాడ: క్రిస్మస్ పర్వదినం క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలని టీపీసీసీ డెలికేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. బుధవారం కోదాడ నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. సమాజంలో శాంతి సామరస్యాలు క్రైస్తవుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్న పాస్టర్ యేసయ్యను అభినందించారు.