16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సర్పంచ్ భర్త హత్యాయత్నం కేసులో ఆరుగురు రిమాండ్

24-12-2025 07:30 PM

ఓటమిని జీర్ణించుకోలేకనే దాడి..

నిందితులపై రౌడీషీట్ ఓపెన్... 

విజయ్ క్రాంతి చేతిలో రిమాండ్ రిపోర్ట్

తాండూరు,(విజయ్ క్రాంతి): వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలో ఈ నెల 18వ తేదీన సర్పంచ్ జంగం బసమ్మ భర్త రుమల్ల సంగయ్య స్వామిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ధరూరు సీఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రత్యర్థులు  ఓటమిని జీర్ణించుకోలేక పక్కా పథకం ప్రకారం కోటిపల్లి  గ్రామానికి చెందిన 1,మొహమ్మద్ షాకీర్, 2, ఆనం శివకుమార్ ,3 మొహమ్మద్ అక్రమ్, 4  అస్మత్ ఖురేషి, 5 మహమ్మద్ షా నవాజ్ 6 నక్కల బందయ్య కలిసి దాడి చేశారు.

పథకం ప్రకారం... రాత్రి 10 గంటల 40 నిమిషాలకు దాడికి పాల్పడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. సర్పంచ్ బసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నామన్నారు. ఆరుగురు నిందితులపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని..శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు  తీసుకుంటామని ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.