24-12-2025 07:21:45 PM
అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా తోకల మారుతి, ప్రధాన కార్యదర్శిగా సతీష్ ఎన్నిక
కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల సర్పంచుల సంఘం కార్యవర్గాన్ని బుధువారం ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుభీర్ లోని తపస్వి డిగ్రీ కళాశాలలో జరిగిన సర్పంచుల సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా డీఎన్టీ(DNT) గ్రామ సర్పంచ్ జాదవ్ సునీత, అధ్యక్షులుగా ధార్ కుభీర్ గ్రామ సర్పంచ్ తోకల మారుతి, ఉపాధ్యక్షులుగా నిగ్వా గ్రామ సర్పంచ్, (బీఆర్ఎస్) మండల నాయకుడు మెంచు రమేష్, ప్రధాన కార్యదర్శిగా సిర్పెల్లి (హెచ్) సర్పంచ్ ఆరెపల్లి సతీష్,
సహాయ కార్యదర్శిగా బెల్గాం గ్రామ సర్పంచ్ నిస్తుర్ గోవర్ధన్, కోశాధికారిగా గోడపూర్ సర్పంచ్ మోరే పల్లవి, సోషల్ మీడియా కన్వీనర్ గా సాంవ్లీ సర్పంచ్ గాడేకర్ లక్ష్మణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీడీఓ సాగర్ రెడ్డి ని కలిసి కార్యవర్గ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తోకల మారుతి మాట్లాడుతూ సర్పంచుల సమస్యలపై అందుబాటులో ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మండల నాయకులు, అధికారులు కార్యవర్గ సభ్యులను సత్కరించారు.