18 April, 2026 | 3:03 AM

టూరిస్టులను ఇంటికి భద్రంగా పంపండి

25-04-2025 02:18 AM

అమిత్‌షాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): పెహల్‌గాంలో టూరిస్టులపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గురువారం మాట్లాడారు. దక్షిణాదికి చెందిన టూరిస్టులను భద్రంగా తిప్పి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉగ్రదాడితో కలత చెందిన టూరిస్టులకు ప్రభు త్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. బాధితుల్ని స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు.