25-04-2025 02:19:30 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 24 ( విజయ క్రాంతి ): కాశ్మీర్ పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికి పందల చర్య అని జిల్లా బిజెపి కమిటీ పేర్కొన్నది. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీగా వెళ్లి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు.
టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని బిజెపి నాయకుల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాశం భాస్కర్, చంద మహేందర్, రత్నపురం బలరాం , మా దశరథ, యువమోర్చా నాయకులు మల్లికార్జున్, బూరుగు మణికంఠ గౌడ్ ,మంగు నరసింహారావు, బట్టు క్రాంతి, బొజ్జ శివ ప్రసాద్ , ముత్యాల సాయి కుమార్ , బోడ స్వామి, నరాల రమేష్, రావుల సంతోష్, బిజెపి నాయకులు రాళ్ల బండి కృష్ణ చారి, మహమ్మద్, శ్రీనివాస్, రమేష్, లక్ష్మీనారాయణ, సతీష్, కోటేష్ , రాజు,ఆంజనేయులు, చంద్రశేఖర్, నర్సింగ్, నాగరాజు, ఉషా కిరణ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.