15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శభాష్ అనుశ్రీ.. ఇంటర్ టాపర్‌కు ఎస్పీ అభినందనలు

25-04-2025 02:17 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ఇంటర్మీడియట్ 2025 ప్రథమ సంవత్సర ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మాదాసు తిరుపతి కుమార్తె అనుశ్రీ ఎంపీసీ విభాగంలో 468 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి శ్రీనివాస్, ఆర్ ఐ లు భాస్కర్, సోములు తదితరులు పాల్గొన్నారు.