17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంతటి రాయలింగు గుండెపోటుతో మృతి

17-12-2025 12:00 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత అంతటి రాయలింగు సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అంతటి రాయలింగు గౌడ్ దివంగత మాజీ సర్పంచ్ గరిగే మధురయ్య సర్పంచ్ గా ఉన్న సమయంలో ఉప సర్పంచ్ గా 11 సంవత్సరాలు పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎ న్నోసార్లు వార్డు సభ్యులుగా పనిచేసి ప్రజలకు సేవ చేశారు.

పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు గౌడు ఇక లేరన్న వార్తతో సుల్తానాబాద్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ వాదిగా అంతటి రాయలింగు ప్రస్థానం తో సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు. ప్రజలకు సేవలు అందించారు... ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , ప్రజలు కుటుంబ సభ్యులకు సంతాపం వెలుబుచ్చారు... మం గళవారం జరిగిన ఆయన అంతేక్రియల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులుపాల్గొన్నారు..

ఎమ్మెల్యే విజయ రమణారావు సంతాపం...

పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి రాయలింగు గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రాయలింగు మృతదేహంపై పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు...