10-02-2026 12:12:44 AM
వెంకటాపూర్, ఫిబ్రవరి 9,(విజయక్రాంతి):మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బేతి సతీష్ సోమవారం భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీలో చేరారు. బి.ఆర్.ఎస్ వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బి.ఆర్.ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సతీష్ యాదవ్కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బి.ఆర్.ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సతీష్ పార్టీ లో చేరడం అభినందనీయమని, జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న ఆయన పార్టీలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి సతీష్ తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు రమేష్, గోవింద్ నాయక్, భవాని, జంపన్న, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, బిక్షపతి, ములుగు పట్టణ అధ్యక్షులు విజయ్, నర్సాపూర్ సర్పంచ్ రుద్రమదేవి, సాంబయ్య, రవి, చిన్న రవి, సతీష్, అశోక్, జ్ఞానేందర్, ప్రకాష్, రాజు, సత్యం, రత్నాకర్, రవీందర్, హర్జి నాయక్, దేవేందర్, అలీ మియా, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.