29 July, 2026 | 9:40 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

టీడీపీ సీనియర్ నేత కాకర్ల సుందరయ్య కన్నుమూత

12-06-2026 03:07 PM

దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో చెక్కుచెదరని ఉక్కుమనిషి.

దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించిన  సుందరయ్య ఇకలేరు.

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన కాకర్ల సుందరయ్య  శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పార్టీ కోసం పుట్టిన మనిషి అన్న పేరు తెచ్చుకున్న సుందరయ్య  గ్రామస్థులకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుగాంచారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీడీపీ జెండా పట్టుకుని ముందుకు సాగిన ఉక్కుమనిషి ఆయన. సుందరయ్య  మరణవార్త తెలియగానే ప్రతిపక్ష నేతలు సైతం కదిలిపోయారు.

నివాళులర్పించిన వారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీనివాసరావు, లింగాపురం సర్పంచి గుగులోతు మంగ, పార్టీ సీనియర్ నాయకులు జవ్వాది రవిచంద్ర కుమార్, బండారు రామకృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి, నేదురి సత్యనారాయణ, పటేల్ వెంకటేశ్వర్లు, కాకర్ల కుమార్, ఉస్మాన్, ఉప సర్పంచ్ తడికల నరేష్ ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... "పార్టీలు వేరైనా సుందరయ్య గారి మానవత్వం, సేవాగుణం అందరికీ ఆదర్శం. దశాబ్దాలుగా టీడీపీలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన మరణం లింగాపురానికి, టీడీపీకి తీరని లోటు" అని అన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు.