2 April, 2026 | 3:20 AM

జూనియర్‌పై సీనియర్ల ర్యాగింగ్

02-04-2026 12:00 AM
  1. 2025 నవంబర్‌లో ఘటన

బాధితుడి పురుషనాళానికి దారం కట్టి, పెన్నులతో గుచ్చి..

అనారోగ్యానికి గురవడంతో వెలుగులోకి 

సీనియర్లపై పోక్సో కేసు?

నిర్మల్ గురుకులంలో ఘటన

నిర్మల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): నిర్మల్ లోని గురుకులంలో జూనియర్‌పై జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని గురుకులంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఏడవ తరగతి చదువుతున్నాడు. అతడిపై అదే పాఠశాలలో చదువుతున్న 10మంది సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బాలుడి పురుషనాళానికి తాడు కట్టి పెన్నులతో గుచ్చి వేధించినట్టు తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన నవంబర్‌లో జరిగింది. బాలుడు అనారోగ్యానికి గురై ఇంటికి వెళ్లి, ఇప్పటివరకు పాఠ శాలకు రాలేదు. ఇన్ఫెక్షన్‌కు గురవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా విషయాన్ని చెప్పా డు. ఈ విషయం అప్పటి ప్రిన్సిపాల్ దృష్టికి తెచ్చారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. వారికి టీసీలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ విద్యా సంవత్సరం చదువుకు ఆటంకం కలగకుండా అవకాశం కల్పిం చారు.

విద్యార్థికి ప్రిన్సిపల్ పర్యవేక్షణలో వైద్యం చేయించారు. ఫిబ్రవరిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రూ.30 వేలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించినట్టు తెలిసింది. తమ కుమా రుడి ఆరోగ్యం బాగుపడలేదని భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మంచి వైద్యం అందించేలా చూడాలని తల్లిదండ్రు లు కోరినట్లు చెప్తున్నారు. అది తమ పరిధి లో లేదని ప్రిన్సిపల్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

10 మందిపై చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది నైతిక బాధ్యత వహించాలని తల్లిదండ్రులు విద్యా ర్థి సంఘ నాయకులతో ఒత్తిడి తెచ్చారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్‌కుమార్‌కు విన్నవించారు. విచారణ జరిపిన అధికారు లు సంఘటనపై చర్యలు తీసుకోవాలని గురుకుల సిబ్బందిని సూచించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

10 మంది సీనియర్లపై పోలీసులు మొదట ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పోక్సోకు బదిలీ చేసినట్టు తెలుస్తోం ది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడుపై కూడా శాఖా పరమైన చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం పాఠశాలను గురుకుల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ సందర్శించి శాఖ పరమైన విచారణ నిర్వహించి నివేదికను కలెక్టర్ ఇతర అధికారు లకు నివేదించినట్టు చెప్పారు.