1 April, 2026 | 11:46 PM

ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సుందర పార్కులా తీర్చిదిద్దాలి

01-04-2026 09:50 PM

*ఐటీడీఏ పీఓ యువరాజు మర్మాట్...

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన నర్సరీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి యువరాజు మర్మాట్ అధికారులకు సూచించారు. బుధవారం ఆదిలాబాద్ శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా తో కలిసి ఉట్నూర్ మండల కేంద్రంలోని ఉద్యాన, శిక్షణ కేంద్రం (హెచ్ఎన్టిసి) ని సందర్శించారు.

ఈ సందర్భంగా 50 ఎకరాల ఉద్యాన నర్సరీని సుందరంగా పార్కు లాగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సందర్శకులు వచ్చి సేదదీరేలాగా ఏర్పాట్లు చేయాలని, విశ్రాంతి భవనాన్ని తిరిగి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఐటిడిఏ ఉద్యాన అధికారి సందీప్ కుమార్ ను ఆదేశించారు. రాక్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, లాన్, వంటి వి ఏర్పాటు చేయాలనీ, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ పీఓ సూచించారు.