ధర్మస్థల కేసులో సంచలన విషయాలు
సిట్ తవ్వకాల్లో మృతదేహం ఆనవాళ్లు లభ్యం
న్యూఢిల్లీ, జూలై 30: ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చా యి. సైట్ నంబర్-1లో తవ్వకాలు ప్రారంభించిన సిట్ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. రెండున్నర అడుగులు తవ్వగానే మహిళ మృతదేహం ఆనవాళ్లు లభ్య మయ్యాయి. చిరిగిన రెడ్ జాకెట్‌తో పాటు, పాన్ కార్డు, ఏటీఎం కార్డు దొరికాయి. అయితే పాన్ కార్డు, ఏటీఎంలపై రెండు వేర్వేరు పేర్లు ఉన్నాయి.
ఒక కార్డుపై మగవాళ్ల పేరు ఉండగా, మరో కార్డుపై లక్ష్మి అని రాసి ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించారు. 1995-2014 మధ్య ధర్మస్థలంలో అనేక మృతదేహాలను బలవంతంగా ఖననం చేశారని పారిశుధ్య కార్మికుడి ఆరోపణల మేరకు సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు.
ధర్మస్థల మంజునాథే శ్వర ఆలయం, స్నానఘాట్ చుట్టూ ఉన్న శ్మశాన వాటికలుగా గుర్తించి 13 ప్రదేశాలపై సిట్ విచారణ నిర్వహించింది. ఈ ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం 2025 జూలై 19న సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రణబ్ మెహంతీ నేతృత్వంలో సిట్ పని చేస్తోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో ఇలాంటి భ యంకర ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తోంది.






