31-07-2025 01:35:57 AM
న్యూఢిల్లీ, జూలై 30: ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపణలు ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. త్రిసభ్య కమిటీ ఇచ్చి న నివేదికను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు. రాజ్యాంగవిరుద్ధమని భావిస్తే విచారణకు ఎందుకు హాజరయ్యారు.
దీనిపై ముందే సవా ల్ చేయాల్సింది కదా’ అని అసహనం వ్యక్తం చేసింది. న్యాయపరమైన తప్పు లు జరిగినప్పుడు దానిపై చర్య తీసుకునే హక్కు భారత ప్రధాన న్యాయ మూర్తికి ఉంటుందని జస్టిస్ దత్తా వ్యా ఖ్యనించారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన తీర్పును అత్యున్నత న్యాయ స్థానం రిజర్వ్ చేసింది.