20 March, 2026 | 9:13 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

లారీ-ట్రావెల్స్ బస్సు ఢీ: ఇద్దరు మృతి

30-11-2025 10:37 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారు జామున నేరడిగొండ మండలం భోథ్ క్రాస్ రోడ్డు దగ్గర హైవేపై హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు వెళ్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న  లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.