2 May, 2026 | 6:53 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మీలా సేవలు మరువలేనివి

26-06-2024 12:24 AM
  • మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్

సూర్యాపేట, జూన్25(విజయక్రాంతి): సుధాకర్ పీవీసీ అధినేత మీలా సత్యనారయణ సేవలు మరువలేనివని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ అన్నారు. మంగళవారం మీలా అయిదో వర్ధంతి సందర్భంగా శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీలా సత్యనారాయణ రాజకీయ వేత్తగా, వ్యాపారవేత్తగా మచ్చలేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. స్వతంత్య్ర సమరయోధుడిగా, ఉపాధ్యాయుడిగా, సామాజికవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. సుధాకర్ పీవీసీ స్థాపించి దేశ వ్యాప్తంగా పేరుపొందిన గొప్ప వ్యక్తి మీలా అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి రాజా, పెద్దిరెడ్డి గణేశ్, పీవీసీ అధినేతలు మీలా మహదేవ్, మీలా జయదేవ్, మీలా వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.