2 May, 2026 | 8:18 PM

డ్రగ్స్‌తో కుటుంబాల విచ్ఛిన్నం

26-06-2024 12:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాటను విడుదల చేశారు. షార్ట్‌ఫిల్మ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం విషప్రయోగం లాంటిదని, ఈ వ్యసనం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయన్నారు.  అక్రమ సంపాదన కోసం కొందరు యువతకు డ్రగ్స్‌ను అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ పెడ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, డ్రగ్స్ నిర్మూలన కోసం నార్కొటిక్ బ్యూరోకు కావలసిన బడ్జెట్‌ను కేటాయిస్తామని చెప్పారు.