21-09-2025 10:33:32 AM
చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి పిహెచ్సిలో సేవలు అద్భుతంగా చేస్తున్నారని ప్రజలు వినియోగించుకుంటున్నారని ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు పిహెచ్సిలో డాక్టర్లు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలగకుండా చూసుకుంటున్నారని గ్రామ ప్రజలు తెలిపారు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా చొప్పదండి పిహెచ్సికి పోయి సేవలను వినియోగించుకుంటున్నామని అన్నారు.
చొప్పదండిలో ఈ రోజు నార్మల్ డెలివరీ అయింది , జక్కుల గౌతమి, బాబు 2.75 కేజీలు, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అలాగే ప్రతీ మంగళవరం జరిగే ఆరోగ్య మహిళా కార్యక్రమం ను 13 సంవత్సరములు దాటిన ప్రతీ మహిళా వినియోగించుకోవాలి. బిపి, షుగర్ మందులు వాడే వాళ్ళు పిహెచ్‌సి చొప్పదండి లో బిపి, షుగర్ మాత్రలు తీస్కోగలరు.. ప్రజలు ఎలాంటి మొహమాటం పడకుండా ప్రభుత్వ పథకాలను సేవలను వినియోగించుకోవాలని పిహెచ్సి సూపర్డెంట్ మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి జుక్కర్ అశ్విన్ కోరారు.