calender_icon.png 21 September, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన

21-09-2025 09:24:42 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలియజేసింది. ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, ప్రకాశం, కర్నూలు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి  జిల్లాలకు భారీ వర్షం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.