21-09-2025 10:42:07 AM
గచ్చిబౌలి,(విజయక్రాంతి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిదీపట్నం ఎక్స్ రోడ్స్ హనుమాన్ దేవాలయం సమీపంలో టోలిచౌకీకి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వెనుక నుండి వేగంగా వచ్చిన టయోటా కొరోల్లా ఆల్టిస్ కారు (నంబరు TS09ED1819) వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు వారిని మరణించినట్లు ప్రకటించారు. మృతులుగా గుర్తించిన వారు టోలిచౌకీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగులు మహ్మద్ అబ్దుల్ అహద్ ఖాన్ (25), మహ్మద్ నజీర్ ఫహద్ (22). కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అత్యధిక వేగంతో నడపడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.