calender_icon.png 21 September, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రాజకీయ నేతలు.. ఉన్నతాధికారులు ఉన్నారు: హైడ్రా కమిషనర్

21-09-2025 11:02:37 AM

హైదరాబాద్: మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా రంగంలో దింగిందని, సర్వే నంబర్ 307 లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో బడా బాబుల్ ఆక్రమణలకు పాల్పడారని ఆయన రంగనాథ్ పేర్కొన్నారు. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నామని, పేదవారిని ముందు పెట్టి.. బడాబాబులు వేయించిన షెడ్డుల తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో ఫుల్ ఫోర్స్ తో దిగిన హైడ్రా ఆదివారం ఉదయం నుంచే ఆక్రమణలు తొలగిస్తుందన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని, 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.