21-09-2025 10:38:10 AM
కరీంనగర్,(విజయక్రాంతి): దసరా నవరాత్రి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. కరీంనగర్ లో కొలువుదీరిన మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలకోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంతో పాటు దేవాలయ పరిసరాల వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నయి.
జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో ఈనెల 22 నుండి ప్రారంభమవుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2వతేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రతతో, అంగరంగవైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్త భక్తులకు శ్రీ మహాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారులను ఆకట్టుకునే విద్యుద్దీపాల అలంకరణల వెలుగులతో విరజిమ్మేళ ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులకు కొంగుబంగారం... కోరిన కోరికలు తీర్చే శ్రీ మహాశక్తి అమ్మవార్లు
శ్రీ మహాశక్తి అమ్మవార్లు నిజంగా చల్లని తల్లులు. ముల్లోకాలకు మూలమైన మహాదుర్గ, మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన దివ్య క్షేత్రం. ఆ తల్లులను ప్రార్థిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శిస్తే సర్వ శుభాలను, ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని పొందవచ్చని శాస్త్ర వచనం. ఈ నవరాత్రి రోజులలో శ్రీ మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా దేవాలయంలో అమ్మవారి భక్తులు స్వీకరించే "భవాని దీక్ష" లు ఇప్పటికే మొదలయ్యాయి. వేలాది మంది భక్తులు తమ శక్తి కొలది 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల కోసం నవరాత్రి దీక్షను ప్రతి ఏటా స్వీకరిస్తు నియమనిష్ఠలతో అమ్మవారిని సేవిస్తూ, తరిస్తున్నారు.
నవరాత్రోత్సవాలలో భవాని దీక్ష చేపట్టి అమ్మవారిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధనుంచైనా ఉపశమనం లభిస్తుందని సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఇక్కడికి వచ్చే భక్తులలో ఉంది. అందుకే దేవాలయ ప్రారంభం నుండి మొదలుకొని నేటి వరకు ఇక్కడ భవాని దీక్ష చేపట్టే భక్తులు గణనీయంగా పెరిగిపోయారు. స్రీ, పురుష బేధములు లేకుండా అందరూ ఆచరించే విశిష్ట భవానీ దీక్ష కోసం కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి శ్రీ మహాశక్తి దేవాలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి మాలాధారణ కోసం, ఉత్సవాల కోసం తరలివచ్చె అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో, ఏ అలంకరణలో దర్శనమివ్వనున్నారంటే, 22వ తేదీ, సోమవారంశ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారం - ఉదయం 8 గం.లకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోబధ్రమండలం, అమ్మవారికి ప్రతిరోజు చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం.సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృత అభిషేకం
23 తేదీ మంగళవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారం
ఉదయం 8 గం.లకు శ్రీ గాయత్రీ దేవి పూజ - అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ. ఉదయం 9 గంటలకు సౌందర్యలహరి, కనకధారా స్తోత్ర పారాయణం...
సాయంత్రం 6 గం.లకు లింగార్చన...
24 తేదీ, బుధవారం,శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారం
ఉదయం 8 గం.లకు శ్రీ అన్నపూర్ణాదేవి పూజ , అమ్మవారికి శాకాంబరీ అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు 108 రకాల నైవేద్యాల సమర్పణ
25తేదీ, గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ కాత్యాయని దేవి (కూష్మాండ ) పూజ, అమ్మవారికి …